బయటపడ్డ బంగారు గుడ్డు.. జీవి కోసం శాస్త్రవేత్తల వేట!

26 August 2023

ఏ పక్షి అయినా బంగారు గుడ్డు పెడుతుందా..? అంటే ఎందుకు పెట్టవు అనేలాంటి ఓ ఘటన జరిగింది.ఫసిఫిక్ మహా సముద్రం అడుగున ఓ బంగారు గుడ్డు’ను కనుగొన్నారు శాస్త్రవేత్తలు.

ఆ బంగారు గుడ్డును ఏ జీవి పెట్టింది..? ఎప్పుడు పెట్టింది..? అనే దానికి గురించి ఏకంగా సముద్రాన్ని జల్లెడ పట్టేస్తున్నారు.

పసిఫిక్ మహా సముద్రంలో బంగారు గుడ్డు మిస్టరీని ఛేదించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు సముద్ర శాస్త్రవేత్తల బృందం.

పసిఫిక్ మహా సముద్రంలో దక్షిణ అలాస్కా తీరంలో ఓ వింత వస్తువును గుర్తించారు శాస్త్రవేత్తలు. గుడ్డు ఆకారంలో ఉండే ఆ వింత వస్తువు బంగారం రంగులో ఉంది.

దానికి ఓ వైపున రంధ్రం కూడా ఉంది. యూఎస్‌కు చెందిన సైంటిస్టులు సీస్కేప్ అలాస్కా యాత్రలో భాగంగా పసిఫిక్ మహా సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు.

దాదాపు రెండు మైళ్ల లోతులో అంతరించిపోయిన అగ్నిపర్వతాన్ని అన్వేషిస్తున్న సమయంలో బంగారం రంగులో మెరిసిపోతున్న బంగారు గోళాన్ని కనుగొన్నారు.

దీన్ని శాస్త్రవేత్తలు స్పూకీ గోల్డెన్ ఎగ్ అని పిలుస్తున్నారు. అయితే ఈ బంగారు గుడ్డును అక్కడ జీవించే ఏదో ఒక జీవి పొదిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ బంగారు గుడ్డు మిస్టరీని ఛేదించే ప్రయత్నాల్లో సముద్ర శాస్త్రవేత్తల బృందం తలమునకలైంది. ప్రస్తుతం ఈ బంగారు గడ్డు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.