భూమి తిరగడం ఆగితే.. ఏమవుతుందో తెలుసా?

TV9 Telugu

15 January 2024

భూమి తిరగడం వల్లే వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. మరి సడెన్‌గా ఈ భ్రమణం ఆగిపోతే ఏమవుతుంది? అది ఇప్పుడు తెలుసుకుందాం.

భూమిని ఆపే శక్తి దేనికీ లేదు. వాతావరణంలోని ఏదీ భూమిని తిరగకుండా ఆపలేదు. భూమి 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడినప్పటి నుంచే తిరుగుతోంది.

విశ్వంలో వివిధ గ్రహాల మధ్య ఉండే ఆకర్షణ, వికర్షణ బలాలు, చందమామ ప్రభావం, సముద్ర అలలు ఇవన్నీ భూమిని తిరిగేలా చేస్తున్నాయి.

భూమి తన అక్షం మీద తిరిగినప్పుడు, పగలు - రాత్రి ఏర్పడుతాయి. ఒక రౌండ్ 23 గంటల 56 నిమిషాల 4.09053 సెకన్లలో పూర్తయింది.

భూమి ఒక రోజులో తిరిగిన సమయంలో 40 వేల 75 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల 6 గంటల 9 నిమిషాలు పడుతుందని అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు.

1 నిమిషంలో భూమి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుందో తెలుసా ? 26.816 కిలోమీటర్లు తిరుగుతుందని చెబుతున్నారు.

భూమి గంటకు 1609 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. సూర్యుని చుట్టూ సెకనుకు 30 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది.