09 June 2024

గొంతు నొప్పి వేధిస్తుందా.? ఈ సింపుల్‌ చిట్కాలు పాటిస్తే సెట్‌ 

Narender.Vaitla

తేనె గొంతు నొప్పిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గొంతునొప్పిని తగ్గుముఖం పట్టిస్తాయి.

గోరువెచ్చని నీళ్లలో ఉప్పువేసి పుక్కిలిస్తే వెంటనే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా చేస్తే గొంతు మంట తగ్గగడంతో పాటు, గొంతు కూడా శుభ్రమవుతుంది. రాళ్ల ఉప్పు అయితే మరీ మంచిది. 

ఉప్పు నీళ్లలో, బేకింగ్ సోడి కలిపి పుక్కిలిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. బేకింగ్ సొడా బ్యాక్టీరియాను చంపుతుంది, కఫం పెరుగుదలను నిరోధిస్తుంది. 

 గొంతు నొప్పితో ఇబ్బంది పడేవారికి ఛామంతి టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటర్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ వంటి గుణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లతో పోరాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

వంటింట్లో ఉండే వెల్లుల్లి కూడా గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. ఇందులోని అల్లిసన్‌ అనే ఆర్గానోసల్ఫర్‌ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్‌ గుణాలు కలిగి ఉంటాయి.

మిరియాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రోగాలకు కారణమయ్యే క్రిములను నశింపజేస్తుంది.

యాపిల్ సైడర్‌ వెనిగర్‌ కూడా గొంతు నొప్పిని నయం చేయడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు బ్యాక్టీరియాను నాశనం చేయడంలో ఉపయోగపడుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.