బాడీ పెయిన్స్‌కి పెయిన్‌ కిల్లర్స్‌ వద్దే వద్దు.. 

Narender Vaitla

16 Aug 2024

నొప్పులను తగ్గించడంలో ఉప్పు క్రీయాశీలకంగా ఉపయోగపడుతుంది. పాలలో కాస్త పసుపు కలుపుకొని తాగడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నొప్పులను దూరం చేస్తాయి.

లవంగాల్లో యూజెనాల్ అనే నూనె ఉంటుంది. ఇది నొప్పి, వాపు, మంటల్ని తగ్గిస్తుంది. కాబట్టి ఈ నూనెను నొప్పులున్న చోట్ల అప్లై చేసుకుంటే వెంటనే ఫలితం ఉంటుంది.

అల్లం కూడా నొప్పులకు ఔషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కీళ్లు, కండరాల నొప్పులను అల్లంతో చెక్‌ పెట్టొచ్చు. అల్లంలో ఉండే ఫైటోకెమికల్స్ నొప్పిని కలిగించే హార్మోన్ల ఉత్పత్తి , విడుదలను నియంత్రిస్తుంది.

తులసికి కూడా నొప్పులను తగ్గించే గుణం ఉంటుంది. ముఖ్యంగా తులసి ఆకులతో చేసిన టీని తీసుకోవడం వల్ల నొప్పులు ఇట్టే పరార్‌ అవుతాయి

ఒంటి నొప్పులకు చెక్‌ పెట్టడంలో దాల్చిన చెక్క దివ్యౌషధంగా పని చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు బాడీ పెయిన్స్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఒళ్లు నొప్పులు తగ్గాలంటే బెర్రీలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని గుణాలు నొప్పులను సహజంగా తగ్గిస్తాయి.

ఇక అరటి పండు కూడా ఒంటి నొప్పులను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పొటాషియం నరాలు, కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.