ప్రధాని మోదీకి ప్రతి ఏటా రాఖీ పంపే మహిళ కన్నుమూత

16 November 2023

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దత్తత తీసుకున్న జయపూర్ గ్రామ మాజీ అధ్యక్షురాలు దుర్గావతి దేవి గుండెపోటుతో మరణించారు.

ప్రధాని దత్తత గ్రామం జయపూర్ గ్రామ మాజీ అధ్యక్షురాలు దుర్గావతి దేవి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.

వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గం జయపూర్‌లో దుర్గావతి దేవి 2008 నుండి 2015 వరకు ఏడేళ్ల పాటు గ్రామ ప్రెసిడెంట్‌గా పని చేశారు.

వారణాసిలోని జయపూర్ గ్రామాన్ని సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద 7 నవంబర్ 2014న ప్రధాని మోదీ దత్తత తీసుకున్నారు.

ప్రధాని మోదీ పాల్గొన్న ఒక కార్యక్రమంలో దుర్గావతి దేవి ప్రసంగించడానికి ముందుకు వచ్చారు. వేదిక ఎత్తుగా ఉండటంతో.. మోదీ స్వయంగా ఆమెకు మైక్‌ను సవరించారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆ గ్రామంలో అప్పటి తన ప్రసంగంలో ప్రెసిడెంట్‌ దుర్గావతి దేవిని సోదరి అని సంబోధించారు.

నాటి నుంచి నేటి వరకు ప్రతి రక్షాబంధన్ నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీకి దుర్గావతి దేవి రాఖీ కడుతూనే ఉంది.

గుండెపోటుతో మృతి చెందిన దుర్గావతి దేవి భర్త అప్పటికే చనిపోయాడు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.