ఆ రాష్ట్రంలో ఏడాదికి రెండుసార్లు స్వాతంత్య్ర వేడుకలు.. ఎందుకంటే.?
TV9 Telugu
12 August 2024
1947 ఆగష్టు 15న బ్రిటిష్ నుండి స్వాతంత్య్రం పొందినందున ప్రతి ఏటా ఈ రోజున భారతదేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు.
ఇదిలా ఉంటె దేశంలో ఉన్న ఓ రాష్ట్రం మాత్రం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రెండు సార్లు చేసుకుంటుంది. అది మరేదో కాదు గోవా.
బ్రిటీష్ వారు భారతదేశానికి రాకముందే పోర్చుగీస్‌వారు గోవాలో 1510 నుండి గోవాలో తిష్టవేశారు. ఇది 1961 వరకు కొనసాగింది.
అక్కడ హిందువులను హింసిస్తూ స్వచ్ఛందంగా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే 15 ఏళ్లపాటు భూమి రద్దు చేస్తామని ప్రకటించింది.
1940 నుంచి గోవాలో ఉద్యమం తీవ్రంగా మరి మహారాష్ట్రలో గోవాను విలీనం చెయ్యాలని కొందరు, కర్ణాటకలో కలపాలని మరికొందరు డిమాండ్ చేశారు.
పోర్చుగీసు పాలనలోనే ఉంటూ స్వయంప్రతిపత్తిని కొందరు కోరుకుంటే మరి కొందరైతే పూర్తి స్వాతంత్ర్యం కోరుకున్నారు.
‘ఆపరేషన్ విజయ్’ పేరుతో 1961 డిసెంబరు18న నేవీ, ఎయిర్ ఫోర్స్‌తో 30 వేల మంది సైనికులు దాడి చేసి వారిని గోవా నుంచి తరిమికొట్టి దీన్ని భారత్ లో విలీనం చేసారు.
పోర్చుగీసు నుంచి స్వతంత్రం పొందినందున డిసెంబర్ 19న ఇండిపెండెన్స్ డే వేడుకలు నిర్వహిస్తారు. అలాగే ఆగష్టు 15న కూడా నిర్వహిస్తారు.