మొదటి ఎలక్ట్రిక్ రైలును ఎవరు జెండా ఊపి ప్రారంభించారు ?

TV9 Telugu

05 February  2024

భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ రైలు 1925 ఫిబ్రవరి 3న ప్రారంభమైంది. ఇది బాంబే విక్టోరియా టెర్మినస్ నుంచి కుర్లా హార్బర్ మధ్య నడిచింది.

మొదటి విద్యుత్ రైలును అప్పటి బొంబాయి (ముంబై) బ్రిటిష్ గవర్నర్ సర్ లెస్లీ విల్సన్ జెండా ఊపి ప్రారంభించారు.

బాంబే విక్టోరియా టెర్మినస్ స్టేషన్ పేరును ఇండిపెండెన్స్ తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌గా మార్చారు.

ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా 1500 వోల్ట్‌ల డైరెక్ట్ కరెంట్ (DC)తో మొదటి ఎలక్ట్రిక్ రైలు నడిచింది.

రైలులో మూడు కోచ్‌లు ఉన్నాయి. చాలా రైలు బొగీలను ఇంగ్లాండ్‌కు చెందిన కామెల్-లెయిర్డ్, జర్మనీలోని వ్యాగన్ ఫ్యాక్టరీ తయారు చేసింది.

విద్యుత్ రైలు మార్గాలు ఇతర రాష్ట్రాలకు విస్తరించాయి. స్వాతంత్ర్యానికి ముందు, 388 కి.మీ పొడవున ఇటువంటి రైలు మార్గం వేయడం జరిగింది.

రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం, 61,813 రూట్ కిలోమీటర్లు అంటే 94% బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్ విద్యుదీకరించడం జరిగింది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ రైళ్లపై చాలా మార్పులు జరిగాయి. అత్యంత వేగంగా పరుగులు పెడుతోంది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎలక్ట్రిక్ రైలు.