దేశంలోని పురాతన ఆనకట్ట ఏక్కడుందో తెలుసా..?

TV9 Telugu

17 July 2024

నీటి ప్రవాహాన్ని ఆపడానికి ఆనకట్ట ఒక అవరోధంగా పనిచేస్తుంది. ఇది వరదలను నివారించడానికి, నీటిపారుదల సౌకర్యాలకు సహాయపడుతుంది.

భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో దాదాపు 5,200 డ్యామ్‌లు ఉన్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 1,845 ఆనకట్టలు ఉన్నాయి.

నీటిని ఆపేందుకు ఆనకట్టలు కట్టిన చరిత్ర శతాబ్దాల నాటిది. భారతదేశంలో అత్యంత పురాతనమైన ఆనకట్ట ఎక్కడ, ఎప్పుడు నిర్మించారో తెలుసుకుందాం.

భారతదేశంలోని పురాతన ఆనకట్ట కల్లనై. ఇది తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఉంది. ఇది చోళ సామ్రాజ్య కాలంలో క్రీ.శ.150లో కావేరీ నదిపై నిర్మించారు.

కల్లనై డ్యామ్ ప్రపంచంలోనే నాల్గవ పురాతనమైన నిర్మాణం. భారతదేశంలోని పురాతనమైనది. ఇది ఇప్పటికీ వాడుకలో ఉంది.

చోళ వంశానికి చెందిన కరికాల ఈ పురాతన ఆనకట్టను నిర్మించారు. ఆనకట్టను గ్రాండ్ అనికట్ అని కూడా పిలుస్తారు.

గ్రాండ్ అనికట్ ఆనకట్ట పొడవు 329 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు. దీని ఎత్తు 5.4 మీటర్లు. ఆనకట్ట నీటిపారుదల కొరకు ఉపయోగిస్తున్నారు.

భారతదేశంలో ఎత్తైన ఆనకట్ట ఉత్తరాఖండ్ లోని టెహ్రీ డ్యామ్. దీని 260 మీటర్ల ఎత్తు. ఇది ప్రపంచంలోనే 13వ ఎత్తైన ఆనకట్ట.