భారత రత్న అవార్డు ఎవరికి ఇస్తారు.. ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి..?
TV9 Telugu
24 January 2024
పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి దేశంలో గొప్ప గౌరవం పతకాల్లో భారతరత్న దేశ అత్యున్నత పౌర పురస్కారం.
దేశానికి చేసిన సేవలకు గానూ భారత రత్న అవార్డును అందజేస్తారు ప్రతి సంవత్సరం జనవరి 25న ప్రకటిస్తుంది భారత ప్రభుత్వం.
రాజకీయాలు, కళలు, సాహిత్యం, సైన్స్, ప్రజా సేవకు సంబంధించిన రంగాలకు చెందిన వారిని ఈ అవార్డుకి ఎంపిక చేస్తారు.
భారతరత్న అవార్డును 1954 సంవత్సరంలో జనవరి 2న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రవేశపెట్టారు.
మొదటిసారిగా ముగ్గురు ప్రముఖులు భారతరత్న అందుకున్నారు. దేశ రాష్ట్రపతి భారతరత్న అవార్డుతో సత్కరిస్తారు.
తొలిసారిగా గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకట రామన్ భారతరత్న అందుకున్నారు.
భారతరత్న అవార్డుని సంవత్సరానికి మూడుసార్లు బహుకరిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన అవసరం లేదు.
భారతరత్న గ్రహీతకు రాష్ట్రపతి చేతుల మీదుగా మెడల్‌తోపాటు సర్టిఫికేట్ ఇస్తారు. అవార్డు గ్రహీత దేశంలోని అన్ని రైల్వే నుండి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందుతారు.