ప్రధాని మోదీ B777 విమానం ప్రత్యేకతలేంటో తెలుసా?

TV9 Telugu

17 July 2024

ప్రధాని నరేంద్ర మోదీకి మరింత భద్రతా చర్చల్లో భాగంగా అత్యాధునిక టెక్నాలజీ కలిగిన రెండు B777 విమానాలను ఏర్పాటు చేశారు.

అత్యాధునిక వ్యవస్థ కలిగిన విమానాలను ప్రధానమంత్రి మోదీతోపాటు ఇతర వీవీఐపీల కోసం కేంద్రం వినియోగిస్తుంది.

ఈ విమానాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన పైలట్లు నడుపుతారు. ఇప్పటి వరకు ఎయిరిండియా పైలట్లు నడిపేవారు.

B777 విమానం అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉన్న విమానం. ఇందులో మిస్సైల్ వ్యవస్థ ఉంది. భారత ప్రధాని విదేశాలకు వెళ్లేందుకు ఉపయోగిస్తారు.

దీన్ని అత్యాధునిక భద్రత, కమ్యూనికేషన్ వ్యవస్థలు, సౌకర్యవంతమైన వసతులతో తీర్చిదిద్దారు.పూర్తిగా ఇంధనం ఉంటె 17 గంటలు ప్రయాణించగలదు.

ఇండియా వన్ బోయింగ్ 777 మోడల్ అక్టోబర్ 2020లో భారతదేశానికి వచ్చింది. ఇది రెండు ఇంజన్ల కలిగి ఉన్న విమానం.

ఈ విమానం వెనుక రెక్కల్లో మిస్సైల్ అప్రోచ్ వార్నింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెన్సార్ల సహాయంతో క్షిపణి దాడులను నివారించవచ్చు.

ఈ విమానం శత్రువుల GPS, డ్రోన్ సిగ్నల్‌లను నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో యాంటీ మిస్సైల్ సిస్టమ్‌ను కూడా అమర్చారు.