వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌లు వచ్చేస్తున్నాయ్‌.. ఆగస్ట్ 15 నాటికి ట్రయల్ రన్‌

16 June 2024

TV9 Telugu

TV9 Telugu

భారతీయ రైల్వే త్వరలో ప్రయాణికుల కోసం రెండు కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఒకటి వందే భారత్ స్లీపర్, మరొకటి రాజధాని ఎక్స్‌ప్రెస్

TV9 Telugu

ఈ రెండు రైళ్లను ఆగస్ట్ 15 నాటికి ట్రయల్ రన్‌ పూర్తి చేసుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. చైర్ కార్ వేరియంట్‌ను విజయవంతంగా ప్రవేశపెట్టిన తర్వాత ఇండియన్‌ రైల్వే.. ప్రస్తుతం వందే భారత్ స్లీపర్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తోంది

TV9 Telugu

దీంతో ప్రయాణికుల కోసం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌ త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల కంటే మెరుగ్గా ఉండే.. ఈ రైళ్ల ట్రయల్‌ రన్‌ త్వరలోనే ప్రారంభం కానుంది

TV9 Telugu

దీంతో అతి త్వరలోనే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌ ట్రయల్‌ రన్‌ పూర్తి చేసుకుని పట్టాలెక్కనుంది. ఇప్పటివరకు కూర్చొని ప్రయాణించేందుకు వీలుండే ఈ రైళ్లలో ఇక నుంచి స్లీపర్ల ఏర్పాటుతో మెరుగైన సేవలను కేంద్రం అందించనుంది

TV9 Telugu

ఇతర రైళ్లతో పోలిస్తే.. ఈ ప్రీమియం రైలులో మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి. ఇప్పటికే సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఛైర్‌కార్‌ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య సర్వీసులను అందిస్తున్నాయి

TV9 Telugu

రైల్వే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంలో భాగంగా దాదాపు 40 వేల సాధారణ కోచ్‌లను అధునాతన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తరహా కోచ్‌లుగా మారుస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది కూడా

TV9 Telugu

రాజధాని ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్.. వంటి ట్రైన్ల ప్రస్తుత ప్రీమియం ఓవర్‌నైట్ ట్రావెల్ ఆప్షన్‌లతో పోలిస్తే స్లీపర్ రైలు అత్యుత్తమ ఫీచర్లను అందిస్తుంది. మరోవైపు, తక్కువ దూరాలకు ప్రయాణికులను చేర్చేందుకు వందే భారత్ మెట్రో రైళ్లను కూడా ఇండియన్‌ రైల్వే అందుబాటులోకి తేనుం

TV9 Telugu

వందే భారత్ స్లీపర్ ప్రోటోటైప్‌లో 11 ఏసీ 3 టైర్ కోచ్‌లు, 4 ఏసీ 2 టైర్ కోచ్‌లు, ఒక ఏసీ 1వ కోచ్‌తో సహా 16 కోచ్‌లు ఉంటాయి. రైలు మొత్తం బెర్త్ సామర్థ్యం 823 మంది, ఏసీ 3 టైర్‌లో 611 మంది, ఏసీ 2 టైర్‌లో 188 మంది, ఏసీ 1లో 24 మంది ప్రయాణించవచ్చు