26 February 2024

టీవీ9 గ్లోబల్ సమ్మిట్.. రెండో రోజు హైలెట్స్‌

TV9 Telugu

దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ వార్షిక కార్యక్రమం వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. 

ప్రధాని మోదీకి టీవీ9, మైహోమ్ గ్రూప్ చైర్మన్  జూపల్లి రామేశ్వరరావు, డైరెక్టర్ జూపల్లి రాము రావు, టీవీ9 ఎండీ, సీఈఓ బరున్ దాస్ స్వాగతం పలికారు.

కేవలం 10 ఏళ్లలో భారత్‌ ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. 

ది రైజ్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్’ అంశంపై మాట్లాడిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్  ప్రపంచంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా, భారతదేశం ముందుగా ముందుకు వస్తుందని తెలిపారు.

 టీవీ9 వాట్‌ ఇండియా థింక్స్‌ టుడే గ్లోబల్‌ సమ్మిట్‌లో కంగనా పాల్గొని.. సినిమా రంగానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. 

సాంకేతిక పరిజ్ఞానమనేది సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచననని కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు.

బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా ఈవెంట్ లో ప్రత్యేక విభాగంలో ‘ఫైర్‌సైడ్ చాట్ – సినిమా ఈజ్ ఫర్ న్యూ ఇండియా’లో పాల్గొన్నారు.  

అంతకు ముందు ఇరానీ స్మృతితో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఇదే వేదికపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.