27 February 2024

కొత్త ఆలోచనలకు వేదికైన టీవీ9 గ్లోబల్ సమ్మిట్.. !

TV9 Telugu

హమారా భారత్‌ మహాన్‌ అన్న మాటకు టీవీ9 నెట్‌వర్క్ గ్లోబల్ సమ్మిట్ వేదికైంది. కొత్త ఆలోచనలకు వాట్ ఇండియా థింక్స్ టుడే వేదికయ్యింది. 

వికసిత భారత్‌ విశ్వరూపాన్ని టీవీ9 వేదికగా ప్రపంచం కళ్లకట్టారు ప్రధాని మోది. పాలనలో గతానికి, ఇప్పటికీ వచ్చిన మార్పులను వివరించారు. 

ప్రధాని ఆకాంక్షిస్తున్న వికసిత భారత్ లక్ష్య సాధనకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని మీడియా దిగ్గజ సంస్థ టీవీ9 హామీ ఇచ్చింది. 

భారతదేశాన్ని తక్కువ అంచనా వేసి.. ఆటపట్టిస్తే ఎవరినైనా వదిలిపెట్టేది లేదంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ టీవీ9 గ్లోబల్ సమ్మిట్ వేదికపై నుంచి మాస్ వార్నింగ్ ఇచ్చారు. 

యోగా గురువు బాబా రాందేవ్ వేదికపై తనదైన రీతిలో యోగాసనాలు వేసి అందరినీ అబ్బురపరిచారు. పనిలో పనిగా రాజకీయ అంశాలపై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

యూనిఫాం సివిల్ కోడ్‌లో తప్పులు ఉన్నాయన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. అందుకే దీన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టంచేశారు. బ్రిటీష్ కాలం నుంచే దేశంలో విభజన రాజకీయాలు నడుస్తున్నాయన్నారు.

తమ పార్టీ వారు రాహుల్ గాంధీని సీరియస్‌గా తీసుకోరని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తాను కూడా రాహుల్ గాంధీ గురించి మాట్లాడబోనన్నారు.

తాను లోక్‌సభకు పోటీచేస్తానంటూ జరుగుతున్న ప్రచారంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించారు. వాస్తవం తాను ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే.. ఇదే సరైన సమయం అంటూ పేర్కొన్నారు.

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలో అత్యంత పురాతనమైందంటూ ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ ప్రశంసలు కురిపించారు. మోదీ నిజమైన దేశభక్తుడని కొనియాడారు.

ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ త్వరలోనే అతరించబోతోందని టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈవో బరున్ దాస్ సంతోషం వ్యక్తంచేశారు.