TV9 Telugu

25 February 2024

అట్టహాసంగా TV9 నెట్‌వర్క్ గ్లోబల్ సమ్మిట్ 2024

దేశంలో అతిపెద్ద TV9 నెట్‌వర్క్ గ్లోబల్ సమ్మిట్ 2024 అట్టహాసంగా దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా ప్రారంభమైంది.

ప్రస్తుతం భారతదేశం ఏమి ఆలోచిస్తుంది.. అనే అంశంపై ప్రముఖులతో శిఖరాగ్ర సదస్సు నిర్వహించింది టీవీ9 యాజమాన్యం.

మూడు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియన్ మాజీ టోనీ అబాట్ సహా పలువురు ప్రముఖులు హాజరు.

స్వాగత ప్రసంగంలో సాఫ్ట్ పవర్, ఎకనామిక్ సెక్టార్‌లలో బ్రాండ్ ఇండియాను ఎలా బలోపేతం చేయాలనే దానిపై మేధోమథనం చేస్తామన్నారు TV9 నెట్‌వర్క్ MD & CEO బరున్ దాస్

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గేరింగ్ అప్ ఫర్ స్పోర్ట్స్ అసెండెన్సీ అనే అంశంపై ప్రసంగించారు. ప్రభుత్వం ఖేలో ఇండియాతో సహా అనేక పథకాలను సద్వినియోగం చేసుకుంటున్న భారత ఆటగాళ్లు సత్ఫలితాలు సాధిస్తున్నారన్నారు. 

మోదీ ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ కార్యక్రమాలు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తున్నాయన్నారు ఫిన్‌కార్ప్‌కు చెందిన అభయ్ భూతాడ. 

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ రవీనా టాండన్‌కు నక్షత్ర అవార్డును అందజేశారు. గ్రామీ అవార్డు గెలుచుకున్న ఫ్లూట్ ప్లేయర్ రాకేష్ చౌరాసియాకు నక్షత్ర సమ్మాన్ లభించింది.

అథ్లెట్ హర్మిలన్ బైన్స్‌కి TV9  నక్షత్ర సమ్మాన్ అవార్డు దక్కింది. షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా TV9 నక్షత్ర సమ్మాన్ అవార్డును అందుకున్నారు.

G20 సమ్మిట్ ద్వారా ప్రపంచ దేశాల ఏకాభిప్రాయాన్ని పెంపొందించుకోగల భారతదేశ సామర్థ్యాన్ని ప్రదర్శించిందన్నారు NITI ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్.