గుడ్‌న్యూస్‌ చెప్పిన తెలంగాణ ఆర్టీసీ.. ఆ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు

11 August 2023

తెలంగాణ రాష్ట్ర ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది

వరుస సెలవుల నేపథ్యంలో పలు మార్గాల్లో ప్రత్యేక సర్వీసులను నడపాలని తెలంగాణ ఆర్టీసీ తాజాగా నిర్ణయించింది.

షిర్డీ, చెన్నైతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు నగరాలకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.

శుక్ర, శనివారాల్లో (ఈ రోజు, రేపు) సుదూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు వీసీ సజ్జనార్ తెలిపారు.

హైదరాబాద్ నుంచి చెన్నై, శిర్డీ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నారు.

ఈ మేరకు ప్రయాణికులకు తెలియజేస్తూ టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ శుక్రవారం (ఆగస్టు 11) ఓ ప్రకటనలో వెల్లడించారు. 

ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ http://tsrtconline.inలో టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు. 

ఇతర పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.