01 September 2023

కట్టిపడేస్తున్న బెంగళూరు ట్రాన్స్‌జెండర్‌ రియల్ స్టోరీ..

ఇప్పటి వరకు చూసిన స్టోరీస్ కంటే మరింత కొత్తగా ఉండే ఈ స్టోరీ మీకోసం.. ఆసక్తికరమైన  ఇది రియల్ లైఫ్ స్టోరీ.

ట్రాన్స్‌జెండర్‌  ప్రీతి బెంగళూరులో ఈ - ఆటో నడుపుతూ జీవనం సాగిస్తోంది. సొంత కుటుంబమే ఆమెను ఇంటి నుంచి గెంటేసింది.  

 18 ఏళ్ల క్రితం బెంగళూరు వచ్చిన ప్రీతి  యాచకవృత్తిలో కొనసాగుతూ అంతులేని వివక్షను  హింసను అనుభవించింది. 

అదృష్టవశాత్తూ ఆమె శిశు మందిర్‌ అనే ఎన్జీవో దృష్టిలో పడింది. ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తాం ఆసక్తి ఉందా అనడంతో వెంటనే ఒప్పుకుంది.

శిక్షణ పూర్తి చేసుకున్న ప్రీతీకి  గతేడాది ఆటో తాళాలు కూడా ఇచ్చి సొంతంగా ఆటో నడుపుకోవాలని ప్రోత్సహించింది ఎన్జీవో.

ట్రాన్స్‌జెండర్లను యాచకవృత్తి నుంచి బయటపడేయటం కోసం డ్రైవింగ్‌ స్కూల్‌ ప్రారంభించారు శిశు మందిర్‌ ఎన్జీవో సెక్రటరీ సి. ఆనంద్‌.

17 ఈ - ఆటోలను ఇప్పటిదాకా విశు మందిర్‌ సంస్థ విరాళంగా ఇచ్చింది. ట్రాన్స్‌జెండర్లకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి లైసెన్స్‌ కూడా ఇప్పిస్తుంది. 

ట్రాన్స్‌జెండర్లతో వ్యవహరించే తీరులో సమాజంలో 30% వరకు మార్పు రావాలని అంటుంది బెంగుళూర్ కు చెందిన ప్రీతి.