రైల్వే టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌గా తొలిసారిగా హిజ్రా
TV9 Telugu
11 February 2024
ప్రస్తుతం హిజ్రాలు అన్ని కూడా రంగాల్లో దూసుకెళ్తు కొంత ప్రోత్సహాం ఉంటే ఏదైనా సాధించగలం అని నిరూపిస్తున్నారు.
దేశవ్యాప్తంగా అన్ని రకాల వృత్తుల్లో తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూ వారి సత్తా ఏంటో చూపిస్తున్నారు.
తాజాగా ఓ హిజ్రా రైల్వే టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులై తొలి టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా రికార్డు నెలకొల్పరు.
తమిళనాడులో తొలిసారిగా రైల్వే టిక్కెట్ ఇన్‌స్పెక్టరుగా నాగర్‌కోవిల్‌కు చెందిన హిజ్రా సింధు నియమితులయ్యారు.
ఈమె తమిళ సాహిత్యంలో బి.లిటరేచర్ చేశారు. 19 ఏళ్ల క్రితం రైల్వేశాఖలో ఉద్యోగంలో చేరిన ఈమె కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలో పనిచేశారు.
అనంతరం అక్కడ నుంచి బదిలీపై తమిళనాడు రాష్ట్రంలో ఉన్న దిండుక్కల్‌కు వచ్చి బాధ్యతలు స్వీకరించారు సింధు.
ఇది తన జీవితంలో మరచిపోలేని జ్ఞాపకమని, హిజ్రా కావడంతో ఏమీ చేయలేమన్న నిరుత్సాహం నుంచి ఈ స్థాయికి చేరుకున్నందుకు గర్వంగా ఉందని ఆమె చెప్పారు.
హిజ్రాలు తమకున్న సమస్యలతో కుంగిపోకుండా విద్య, శ్రమతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు ఆమె.
ఇక్కడ క్లిక్ చెయ్యండి