స్వాతంత్ర దినోత్సవం స్పీచ్ కోసం టిప్స్..
TV9 Telugu
13 August 2024
మీరు స్వాతంత్ర దినోత్సవం రోజు స్పీచ్ ఇవ్వాలి అనుకుంటే దానికి సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
నేటి సమాజానికి మనం ఎలా తోడ్పాటు అందించగలమొ తెలియజేస్తూనే స్వతంత్ర సమరయోధుల వ్యక్తిగత జీవితం నేటి యువత ఏమి నేర్చుకోవాలో తెలియజేయాలి.
ఈ స్పీచ్‌లో భాగంగా మొదటగా మన దేశనికి స్వాతంత్రం వచ్చి ఎన్ని వసంతాలు పూర్తయిందో తెలియజేయాల్సి ఉంటుంది.
మీ ప్రసంగంలో జాతుల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య, అదేవిధంగా లింగ వివక్షతతో కూడిన మాటలు లేకుండా చూసుకోవాలి.
మీరు ముందుగా స్పీచ్ ఇవ్వబోయే ముంది సభకు హాజరైన అదితిలకు గౌరవం నమస్కారం తెలియజేసి ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెప్పాలి.
మీ ఇచ్చే ప్రసంగం వేడుకలో ఉన్నవారిని ఉత్సహపరిచేలా మాత్రమే కాదు.. వారిలో స్ఫూర్తిని కలిగించేలా ఉంటె ఇంకా బెస్ట్.
అలాగే దేశ పురోగతి గురించి కూడా తెలుసుకొని అక్కడ వివరించాలి. దేశం అభివృద్ధి బాటలో నడవాలంటే యువత ఏమి చెయ్యాలో చెప్పాలి.
నేటి యువత తప్పు దారిలో వెళ్లకుండా ఉంటాలంటే ఏమి చెయ్యాలి, క్రమ శిక్షణతో ఎలా మెలగాలో వంటి విషయాలతో వారిని మోటివేట్ చెయ్యాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి