13 September 2023

విమానయానం పురోగమనం.. అనూహ్యంగా పెరుగుతున్న ప్రయాణికులు..

ఈ మధ్య కాలంలో క్రమక్రమంగా  విమానాల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య నెలనెలా పెరుగుతోంది. 

ఈ ఏడాది ఆగస్టు మాసంలో డొమెస్టిక్ ప్యాసింజర్ ట్రాఫిక్ 2022 ఆగస్టు మాసంతో పోల్చితే 23 శాతం పెరిగి 1.24 కోట్లకు చేరుకుంది. 

మునుపటి నెల (జులై 2023)తో పోల్చితే దేశీయ విమానాల్లో రాకపోకలు సాగించిన వారి సంఖ్య 3.2 శాతం పెరిగింది. మొత్తం 1.21 కోట్ల మంది ప్రయాణీకులు విమానాల్లో ప్రయాణించారు. 

కోవిడ్ పాండమిక్‌కు ముందు 2019 ఆగస్టు నెలతో పోల్చుకున్నా డొమెస్టిక్ ప్యాసింజర్ ట్రాఫిక్ 6 శాతం ఎక్కువ (1.18 కోట్లు)గా రేటింగ్ సంస్థ ఇక్రా వెల్లడించింది. 

డొమెస్టిక్ ప్యాసింజర్ ట్రాఫిక్‌లో నమోదైన వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇలాగే కొనసాగుతుందని ఇక్రా అంచనావేసింది. 

కోవిడ్ పాండమిక్ నాటి గడ్డు పరిస్థితుల నుంచి విమానయాన పరిశ్రమ ఇక పూర్తిగా గట్టెక్కినట్లేనని ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.

ఇక దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు భారీ ఆదాయాన్ని ఆర్జించే అవకాశముందని తెలిపింది. 

విమానాల్లో రాకపోకలు సాగించే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్న అంచనాలు విమానయాన రంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.