05 September 2023

రేషన్ కార్డుదారులకు అలర్ట్..!

భారత్‌లో సబ్సిడీ రేషన్‌తో పాటు సంక్షేమ పథకాలు అందుకోవాలంటే రేషన్ కార్డు తప్పని సరి.

ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా సబ్సిడీ ద్వారా రేషన్ అందిస్తున్న కేంద్ర సర్కార్.

దేశవ్యాప్తంగా నకిలీ కార్డుల ఏరివేతకు స్వీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం.అన్ని రాష్ట్రాల్లో రేషన్ కార్డుల వెరిఫికేషన్ చేపట్టిన కేంద్ర ప్రభుత్వం. 

ఆధార్ నంబర్‌తో రేషన్ కార్డు లింక్ చేయాలని పదే పదే చెబుతున్న కేంద్ర సర్కార్.

రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలు సెప్టెంబర్ 30 లోగా రేషన్ కార్డు, ఆధార్ నంబర్ లింక్ చేసుకోవడానికి డెడ్ లైన్.

గడువు లోగా ఆధార్ నంబర్ లింక్ చేసుకోని కుటుంబానికి అక్టోబర్ నెల నుంచి రేషన్ కార్డు క్లోజ్ చేసే అవకాశాలు.

రేషన్ కార్డుతో ఆధార్ కార్డు సీడింగ్ చేసుకోని కుటుంబాల రేషన్ కార్డును నకిలీగా భావించి డిలీట్ చేయనున్న సర్కార్. 

ఇప్పటికే అన్ని జిల్లాలా పౌర సరఫరాల కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.

ఆధార్ కార్డు లింక్ కోసం రేషన్ డీలర్ లేదా బ్లాక్ సప్లై బ్రాంచ్ అధికారికి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.