జీ20లో నోరూరించే స్పెషల్ భారతీయ వంటకాలు..

09 September 2023

భారత్‌ మండపం వేదికగా జీ-20 సదస్సు అట్టహాసంగా కొనసాగుతోంది. ఓ శ్లోకాన్ని చదువుతూ జీ20 సదస్సు ప్రారంభించారు ప్రధాని మోదీ. 

అట్టహాసంగా

వసుదైక కుటుంబం థీమ్‌తో జీ20 సదస్సు జరుగుతోంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశాయి. వీటిలో ఏపీ, తెలంగాణకు సంబంధించిన స్టాల్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.

తెలుగు రాష్ట్రాల స్టాల్స్

ప్రపంచ దేశాల నుంచి వచ్చిన దేశాధినేతలకు తొలి రోజు రుచికరమైన విందును అందిస్తున్నారు. G-20 అతిథులు ఈ ప్రత్యేక వంటకాలను రుచి చూడనున్నారు.

రుచికరమైన విందు

భారత దేశ విభిన్న సంస్కృతిని తెలిపేలా భారత మండపంను అలంకరించారు. G20 సమ్మిట్‌లో అతిథులకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రుచికరమైన వంటకాలు వడ్డిస్తున్నారు. 

రుచికరమైన వంటకాలతో ఆతిథ్యం

రాత్రి 7గంటల నుంచి 8గంటల వరకు డిన్నర్‌ కోసం దేశాధినేతలంతా చేరుకుంటారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ విందును ఇవ్వబోతున్నారు. 

రాష్ట్రపతి విందు

విందు కార్యక్రమానికి ముందు ఫొటో సెషన్ కూడా ఉంటుంది. రాత్రి 8గంటల నుంచి 9గంటల 15 నిమిషాల వరకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విందులో కలిసిన అతిథులంతా ఒకరినొకరు పలకరించుకుని సంభాషించుకుంటున్నారు.

అతిథులంతా ఒకరినొకరు

అతిథులకు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనంలో 500 కంటే ఎక్కువ వంటకాలు తయారు చేశారు. ఇందులో మిల్లెట్ వంటకాలు ప్రత్యేకంగా చేర్చబడ్డాయి.

మిల్లెట్ భోజనం