రిపబ్లిక్ డే గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

TV9 Telugu

25 January 2024

1950లో మొదటి రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించారు. ప్రస్తుతం మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంగా పిలువబడే ఇర్విన్ యాంఫీ థియేటర్‌లో జరిగింది.

మొదటి రిపబ్లిక్ డే పరేడ్‌లో మూడు వేల మంది భారత సైనిక సిబ్బంది, వందకు పైగా విమానాలు కవాతులో పాల్గొన్నాయి.

మొదటి నాలుగు సంవత్సరాలలో రిపబ్లిక్ డే పరేడ్ కవాతులు ఇర్విన్ స్టేడియం, రెడ్ ఫోర్ట్, రాంలీలా మైదాన్‌లో నిర్వహించారు.

1955లో రాజ్‌పథ్‌లో మొదటిసారిగా నిర్వహించిన గణతంత్ర వేడుకలకు పాకిస్థాన్ గవర్నర్ జనరల్ మాలిక్ గులాం మహమ్మద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దేశ రాజధాని ఢిల్లీలోని విజయ్ చౌక్‌లో ప్రతి సంవత్సరం జనవరి 29న జరిగే బీటింగ్ రిట్రీట్ వేడుక 1600ల నాటిది.

సైనిక దళాల ఉపసంహరణను ప్రకటించే ఈ సంప్రదాయం, బ్రిటిష్ పాలకుడు కింగ్ జేమ్స్ II కాలం నుంచి కొనసాగుతోంది.

రోజు యుద్ధం ముగింపును ప్రకటించడానికి ముందు కింగ్ జేమ్స్ II తన దళాలను డ్రమ్స్ కొట్టడం, జెండాలను తగ్గించడం, కవాతు నిర్వహించడం వంటివి చేయించేవారు.

2018లో మొదటిసారిగా భారతదేశ రిపబ్లిక్ డే పరేడ్‌లో విదేశీ సైనిక బృందం, ఫ్రెంచ్ ఆర్మీ సిబ్బంది పాల్గొన్నారు.