భారత జాతీయ జండా గురించి ఈ విషయాలు తెలుసా.?

TV9 Telugu

14 August 2024

1904లో సిస్టర్ నివేదిత తొలి జాతీయ జెండాను రూపొందించారు. ప్రస్తుత జెండాను పింగాలి వెంకయ్య 1931లో రూపొందించగా జూలై 22, 1947న ఆమోదించబడింది.

ఇందులో పైభాగంలో కాషాయం, మధ్యలో తెలుపు, దిగువన ఆకుపచ్చతో పాటు 24-స్పోక్స్‎తో నేవీ బ్లూ అశోక చక్రం తెల్లటి రంగు మధ్యలో ఉంది.

జాతీయ జెండాలోని కాషాయం ధైర్యం, త్యాగాన్ని; తెలుపు రంగు నిజాయితీ, శాంతి, స్వచ్ఛతను; ఆకుపచ్చ విశ్వాసం, పడి పంటలను; అశోక చక్రం ధర్మాన్ని, పురోగతిని సూచిస్తాయి.

మొదటి భారత జాతీయ జెండా ఆగష్టు 15, 1947న ఎగురవేయబడింది. ఇది ఫోర్ట్ సెయింట్ జార్జ్ మ్యూజియంలో ప్రదర్శించబడింది.

భారత జెండా తప్పనిసరిగా ఖాదీతో తయారు చేయబడాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దాని తయారీ ప్రక్రియకి కఠినమైన మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది.

ఫ్లాగ్ ఆఫ్ ఇండియా చట్టంలోని 1.3, 1.4 ప్రకారం జాతీయ జెండా దీర్ఘచతురస్రాకారంలో ఏ పరిమాణంలో అయినా పొడవు, ఎత్తు (వెడల్పు) నిష్పత్తి 3:2 ఉండాల.

చెన్నైలోని సెయింట్ జార్జ్ కోటలో బ్రిటీష్ ప్రభుత్వ 'జాక్' కోటలోని ధ్వజస్తంభంపై భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని తొలిసారిగా ఎగురవేశారు.

కర్ణాటకలోని బెంగేరి గ్రామంలో 'కర్ణాటక కతి గ్రామోత్యోక్ సంయుక్త సంఘ' (KKGSS)లో ఉన్న కర్మాగారంలో మాత్రమే భారతీయ జెండాలను తయారు చేస్తారు.