భారతరత్న ఎల్‌కే అద్వానీ ప్రస్థానం ఇలా..!

TV9 Telugu

04 February  2024

కరాచీలో పుట్టి, స్వాతంత్ర్యం కోసం పోరాడి, దేశానికి ఉప ప్రధానమంత్రిగా, భారతరత్న ఎల్‌కే అద్వానీ ప్రయాణం.

దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీని భారతరత్నతో సత్కరించాలని నిర్ణయించిన భారతీయ కేంద్ర ప్రభుత్వం.

అద్వానీని భారతరత్నతో సత్కరిస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. సోషల్ మీడియా ద్వారా వెల్లడి.

లాల్ కృష్ణ అద్వానీ పాకిస్థాన్‌లోని ఒకప్పటి ఇండియా ప్రస్తుత పాక్ రాజధాని కరాచీలో సింధ్ హిందూ కుటుంబంలో జన్మించారు.

అప్పట్లో భారత్, పాకిస్థాన్ విభజన సమయంలో అద్వానీ కుటుంబం మహారాష్ట్ర రాజధాని ముంబైకి వచ్చి స్థిరపడింది.

లాల్ కృష్ణ అద్వానీ 1998 సంవత్సరం నుండి 2004 సంవత్సరం వరకు NDA ప్రభుత్వంలో కేంద్ర హోం మంత్రిగా పనిచేశారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో 2002 మరియు 2004 మధ్య ఉప ప్రధానమంత్రి అయ్యారు. 2015లో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది.

లాల్ కృష్ణ అద్వానీ భారతరత్న అవార్డు పొందిన రెండవ బిజెపి నాయకుడు. అలాగే దీన్ని అందుకున్న వారిలో 50వ వ్యక్తి.