11 December 2024
Pic credit - Social Media
TV9 Telugu
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కు చెందిన ఏఐ ఇంజనీర్ అతుల్ సుభాష్ తన భార్య, అత్తమామలపై తీవ్ర ఆరోపణలు చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అతుల్ సుభాష్ సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు జడ్జి రీటా కౌశిక్ లంచం డిమాండ్ చేసి వేధిస్తున్నారని నోట్‌లో అతుల్ ఆరోపించారు.
సుభాష్ 24 పేజీల సూసైడ్ నోట్, సుమారు 1 గంట వీడియోను ఆత్మ హత్యకు ముందు రిలీజ్ చేశాడు. అందులో ఫ్యామిలీ కోర్టు జడ్జి రీటా కౌశిక్ లంచం తీసుకున్నారని ఆరోపించారు.
రీటా కౌశిక్ జౌన్‌పూర్‌లోని ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి. రీటా తన న్యాయ సేవను మున్సిఫ్‌గా మార్చి 20, 1996న ప్రారంభించారు.
దీని తర్వాత, రీటా 1999లో సహరన్‌పూర్‌లో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌గా కొనసాగారు. 2000-2002 మధ్య కాలంలో మథురలో అదనపు సివిల్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు.
దీని తరువాత 2003లో రీటా సివిల్ జడ్జి పదవితో అమ్రోహాకు బదిలీ అయ్యారు. రీటా 2003 నుంచి 2004 వరకు లక్నోలో ప్రత్యేక CJMగా ఉన్నారు.
2018లో తొలిసారిగా అయోధ్యలోని ఫ్యామిలీ కోర్టుకు ప్రిన్సిపల్ జడ్జి అయ్యారు. ఆమె 2022 వరకు అయోధ్యలోనే కొనసాగారు. ఆ తర్వాత జౌన్‌పూర్ కు బదిలీ అయ్యారు.