జ్ఞానవాపిపై ASI సర్వే రిపోర్ట్‌లో సంచలన విషయాలు
TV9 Telugu
26 January 2024
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు కింద అతి పెద్ద ఆలయం ఆనవాళ్లు గుర్తించిన భారత పురావస్తు శాఖ.
మసీదు ఉన్న ప్రదేశంలో తెలుగు భాషతో పాటు వివిధ భాషలతో కూడిన 32 కీలక శాసనాధారాలు లభ్యమైనట్లు తెలిపింది ASI.
17వ శతాబ్ధ సమయంలో ఇక్కడ ఉన్న హిందూ ఆలయాన్ని కూల్చివేసి మసీదును కట్టినట్టు నిర్ధారించిన ASI అధికారులు.
ఆలయ స్తంభాలతోనే ప్రస్తుత మసీదు నిర్మించారని తేల్చి చెప్పిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే రిపోర్ట్.
వారణాసి కోర్టులో సర్వే నివేదికను సమర్పించిన భారత పురావస్తు శాఖ. 1500 పేజీల నివేదికను కోర్టులో సమర్పించిన ASI కమిటీ.
జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించినప్పుడు లభించిన వస్తువుల వివరాలను రిపోర్ట్‌లో పొందుపర్చిన ASI అధికారులు.
సీల్డ్‌కవర్‌లో కోర్టుకు నివేదికను అందచేసిన భారత పురావస్తు శాఖ. మసీదులో 100 రోజుల పాటు సైంటిఫిక్ సర్వేను వీడియోగ్రఫీ కూడా చేసిన ASI.
1669లో కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు ధ్వంసం చేసి మసీదును నిర్మించారని హిందూ సంస్థల ఆరోపణ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి