జాతీయ జెండా నిబంధనలు.. 

TV9 Telugu

15 August 2024

భారత జాతీయ పతాకాన్ని నేలపై పడేయకూడదు. నీటిపై తేలనీయకూడదు. జాతీయ జెండాను దుస్తులుగా కుట్టించుకోవద్దు.

జాతీయ జెండాను నడుము కింది భాగంలో చుట్టుకోవద్దు. దీనిని ఇంట్లో తుడవడానికి, న్యాప్‌కిన్‌గా ఉపయోగించకూడదు.

జాతీయ జెండాను అలంకరణ కోసం ఉపయోగించకూడదు. మీరు ఇంట్లో వాడిన జాతీయ పతాకాన్ని ఏ వస్తువు మీదా కప్పవద్దు.

చిరిగిన, నలిగిన, తిరగబడిన జెండాలను ఎగురవేయొద్దు. జాతీయ పతాకాన్ని ఎగరేసినప్పుడు.. అంతకంటే ఎక్కువ ఎత్తులో మరే ఇతర జెండాలు ఉండకూడదు.

త్రివర్ణ పతాకం ఎగరేసినప్పుడు కాషాయ రంగు పైకి ఉండాలి. స్తంభానికి చిట్టచివరనే జెండాను ఎగురవేయాలి. సగం కిందకు దించి ఎగురవేయకూడదు.

జాతీయ జెండాను ఉద్దేశపూర్వకంగా నేలపై లేదా నీటిలో, కాలిబాటలో వేయరాదు. త్రివర్ణ పతాకం దేశ గౌరవానికి చిహ్నం. దాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించకూడదు.

త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేప్పుడు.. జెండా ఎగురవేసే వ్యక్తి ముఖం ప్రేక్షకుల వైపు, త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ అతడి కుడి వైపున ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

జాతీయ జెండాకు సంబంధించి పాటించే నిబంధనల్లో పొరపాట్లు, తప్పులు, ఉల్లంఘనలకు పాల్పడితే, చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు.