చెత్తకుప్పలో బయటపడ్డ రూ.25 కోట్లు..!
11 November 2023
కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులోని చెత్త కుప్పలో బయటపడ్డ రూ.25 కోట్ల విలువైన అమెరికన్ డాలర్ నోట్లు.
నవంబర్ 1న సల్మాన్ షేక్ అనే వ్యక్తి చెత్త ఏరుతుండగా మొత్తం 23 నోట్ల కట్టలు బయటపడ్డాయని సమాచారం అందింది.
సల్మాన్ యాజమాని బొప్పా, స్థానిక సామాజిక కార్యకర్త కలిముల్లాతో కలిసి బెంగళూరు పోలీసు కమిషనర్‌కు అప్పగింత.
ఆ 25 కోట్లు విలువైన డాలర్ నోట్లపై రకరకాల రసాయనాలు పూసి ఉన్నట్టుగా గుర్తించిన కర్ణాటకలోని బెంగళూరు పోలీసులు.
బ్లాక్ డాలర్ స్కామ్‌కు పాల్పడుతున్న ముఠా.. నోట్లను చెత్తలో పడేసి వెళ్లిపోయి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు.
డాలర్లు నకిలీవో కాదో తేల్చేందుకు ఆర్‌బీఐ (రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా) కి పంపిన బెంగళూరు పోలీసు అధికారులు.
ఆర్‌బీఐ (రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా) వాటిని చెక్ చేసి ఫలితాన్ని కర్ణాటక పోలీసులకు త్వరలోనే తెలియచేయనుంది.
ఆ డాలర్లు నకిలీవో కాదో ఆర్‌బీఐ ఫలితం వెల్లడించిన దీనిపై బెంగుళూరు పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి