ఆందోళన కలిగిస్తున్న రోడ్డు ప్రమాదాలు.. అధికంగా ఆ రాష్ట్రంలోనే

02 November 2023

దేశంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా లక్షల మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.

గతంతో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు 12 శాతం వరకు పెరిగినట్లు తాజాగా వచ్చిన ఓ కొత్త నివేదికలో వెల్లడైంది.

అతివేగం, మద్యం సేవించడం, పొగ మంచు, హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం వంటివి దీనికి కారణాలు.

‘భారత్‌లో రోడ్డు ప్రమాదాలు – 2022’కు సంబంధించిన నివేదికను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది.

జాతీయ రహదారుల్లో 32.9 శాతం కాగా, రాష్ట్ర రహదారుల్లో 23.1శాతం, మరో 43.9 శాతం ప్రమాదాలు ఇతర రహదారులపై జరిగాయి.

ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా తమిళనాడులో చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లోనే ఎక్కువగా జరిగాయి.

అయితే రోడ్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మాత్రం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో అధికంగా ఉందని వెల్లడైంది.

మొత్తంగా దేశంలో ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. అందులో గంటకు 19 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలో వెల్లడైంది.