ఈ ఏడాది జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రత్యేకతలు ఇవే..
TV9 Telugu
25 January 2024
రిపబ్లిక్ డే పరేడ్ జనవరి 26 ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలోని విజయ్ చౌక్ నుండి కర్తవ్య పథ్ వరకు జరుగుతుంది.
రిపబ్లిక్ డే పరేడ్‌లో 42,000 సాధారణ ప్రజలతో సహా సుమారు 77,000 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
ఈసారి ప్రత్యేకించి "వికసిత భారత్", "భారత్ - లోక్ తంత్రతా కీ మాతృకా" ధీమ్ తో రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుగుతున్నాయి.
ఈసారి తొలిసారి మేజర్ జనరల్ సుమిత్ మెహతా నేతృత్వంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలకు చెందిన మహిళా త్రివిధ దళాల బృందం పెరేడ్ లో పాల్గొంటోంది.
ఈ సారి రిపబ్లిక్ డే పరేడ్‌లో 95 మందితో కూడిన ఫ్రాన్స్ కవాతు బృందం, 33 మంది సభ్యుల బ్యాండ్ బృందం, రెండు రాఫెల్ యుద్ధ విమానాలు ఈ వేడుకల్లో పాల్గొంటాయి.
75వ రిపబ్లిక్ డే పరేడ్ లో భారత దళాలతో కలిసి కవాతు చేస్తున్న ఫ్రెంచ్ సైనిక బృందంలో ఆరుగురు భారతీయులు ఉన్నారు.
ఈసారి పెరేడ్‌లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చీరలను 'అనంత్ సూత్ర' ఎగ్జిబిషన్ పేరుతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రదర్శిస్తోంది.
ఈ పెరేడ్ లో కృత్రిమ మేధ (AI) నేపత్యంలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక శకటాన్ని ప్రదర్శిస్తోంది. ఈ శకటం కృత్రిమ మేధ గురించి ప్రాక్టికల్ గా వివరిస్తుంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రదర్శించే చంద్రయాన్ -3 మిషన్ శకటం ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రకాశించనుంది.