TV9 Telugu
భారత్‌పై దాడి చేస్తే ఉపేక్షించేదేలే: రాజ్‌నాథ్ సింగ్
28 Febraury 2024
టీవీ9 నెట్‌వర్క్ నిర్వహిస్తోన్న వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్ మూడో రోజున కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విచ్చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. భారతదేశాన్ని తక్కువ అంచనా వేసి.. ఆటపట్టించే ఎవరినైనా కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
పుల్వామా, డోక్లాం సంఘటనలకు భారత్ తగిన సమాధానం ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.
‘ఏ దేశంతోనైనా భారత్ సయోధ్యకే వెళ్లాలని చూస్తుంది. కయ్యానికి కాలు దువ్వదు. అలా కాదని ఎవరైనా భారతదేశాన్ని ఆటపట్టిస్తే.. వదిలిపెట్టేది లేదు.
ఇప్పటివరకు ఏ దేశంపైనా భారత్ దాడి చేయలేదు. వేరే దేశానికి చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా స్వాధీనం చేసుకొని ఏకైక దేశం భారత్.
చైనా అంశంపై ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్‌ను ప్రశ్నించగా.. సత్సంబంధాలపై చర్చలు సాగుతున్నాయి. చింతించాల్సిన అవసరం ఏం లేదు అన్నారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో దేశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవ్వరికీ తలవంచనివ్వమని గట్టి విశ్వాసంతో చెప్పారు రాజ్‌నాథ్ సింగ్.
చైనా కూడా భారత్‌తో చర్చలకు సిద్దంగా ఉంది కాబట్టి.. ఇరు దేశాల మధ్య సయోధ్యకు చర్చలు జరుగుతున్నాయన్నారు రాజ్‌నాథ్ సింగ్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి