TV9 Telugu
సుదర్శన్ సేతు బ్రిడ్జి ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?
26 Febraury 2024
Pic credit - Twitter (X)
అరేబియా సముద్రంలో ప్రధాని మోదీ స్కూబా డైవింగ్ చేశారు. సముద్రజలాల్లోకి వెళ్లి పురాతన ఆధ్యాత్మిక నగరమైన ద్వారకా వద్ద ప్రార్థనలు చేశారు.
జలాల్లో మునిగి ఉన్న ద్వారకా నగరిలో ప్రార్థనలు జరిపేందుకు వెళ్లడం ఒక దివ్యమైన అనుభూతిని కలిగించిందని ప్రధాని చెప్పారు.
ద్వారకా దీపం వైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్య దేశాల్లో ఒకటి. మహాభారతం సభా, శాంతి పర్వాల్లో ద్వారక ప్రస్తావన ఉంది.
శ్రీకృష్ణుడి పాలించిన సుందర ద్వారకా నగరం అరేబియా సముద్రంలో మునగడంతో భక్తులెవరూ అక్కడికి వెళ్లలేకపోతున్నారు.
పురాతన ద్వారకను భక్తులు వీక్షించేందుకు తాజా గుజరాత్ ప్రభుత్వం ద్వారకాలో జలాంతర్గామి సేవలను ప్రారంభించింది.
ఇందుకోసం ముంబయికి చెందిన ప్రభుత్వ రంగ నౌకా సంస్థ మజ్‌గావ్ డాక్‌యార్డ్‌తో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ జలాంతర్గామికి 24 మంది యాత్రికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. పర్యాటకులతో పాటు ఇద్దరు పైలట్లు, ఇద్దరు డైవర్లు, టెక్నీషియన్, గైడ్ కూడా ఉంటారు.
ఇది భక్తులను అరేబియా సముద్రంలో 300 అడుగుల దిగువకు తీసుకెళ్తుంది.. అక్కడి నుంచి పురాతన నగర శిథిలాలతో పాటు అరుదైన సముద్ర జీవాలను చూడవచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి