ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన భారత్ రక్షణ రంగ ప్రతిష్ట

26 September 2024

TV9 Telugu 

ప్రపంచంలో భారతదేశ రక్షణ రంగ ప్రతిష్ట బాగా పెరిగింది. 90కి పైగా దేశాలకు భరత్ ఆయుధాలను ఎగుమతి చేస్తోంది.

భారత రక్షణ రంగం నుంచి వస్తున్న ఉత్పత్తి రూ.1.27 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ సంఖ్య ఇప్పటి వరకు అత్యధికం.

భారతదేశం ఇప్పుడు స్నేహపూర్వకం ఉన్న 90 కంటే ఎక్కువ దేశాలకు ఆయుధాలు, సైనిక పరికరాలను ఎగుమతి చేస్తోంది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం పదేళ్లు పూర్తైన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.

ప్రస్తుతం భారత సాయుధ బలగాలు స్వదేశంలో తయారైన ఆయుధాలు, పరికరాలను ఉపయోగిస్తున్నాయి. దేశం ప్రపంచ రక్షణ పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది.

ప్రధాని మోదీ సమర్ధవంతమైన నాయకత్వంలో దేశం ప్రతి రంగంలో స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది.

పదేళ్ల తర్వాత రక్షణ రంగంతోపాటు ప్రతి రంగంలోనూ అనేక సంస్కరణలు వచ్చాయి. ప్రపంచంలోని రక్షణ పారిశ్రామిక రంగంలో భారత్‌ దూసుకుపోతోంది.

దేశీయ రక్షణ పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. భారత రక్షణ ఎగుమతులు 2023-24లో తొలిసారిగా రూ.21,000 కోట్ల మార్కును అధిగమించాయి.

వచ్చే ఐదేళ్లలో రూ.50,000 కోట్లకు పెంచాలని రక్షణ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం అతిపెద్ద ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటి.