మరోసారి అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుక.. ఈసారి ఎక్కడో తెలుసా?

TV9 Telugu

29 May 2024

ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్ జూలైలో తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోబోతున్నాడు.

అంతకు ముందు అంబానీ కుటుంబం వధూవరుల కోసం గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌ను వారి తాతగారి ఊరు జామ్‌నగర్‌లో నిర్వహించింది.

ఇప్పుడు కుటుంబ సభ్యులంతా మరోసారి ఈ జంటకు ప్రీ వెడ్డింగ్‌ వేడుక నిర్వహించనున్నారు. దీని కోసం అనంత్‌-రాధిక ఇద్దరూ ఫ్లైట్ ఎక్కారు.

ఇటలీలో క్రూయిజ్‌లో గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌ను ఏర్పాటు చేసి ముఖేష్ అంబానీ తన కొడుకు, కాబోయే కోడలు కోసం సర్ ప్రైజ్ ఇచ్చారు.

ఈ క్రూయిజ్ ఇటలీ నుండి ఫ్రాన్స్‌కు ప్రయాణిస్తుంది. ఈ సమయంలో అంబానీ కుటుంబం సముద్రం మధ్యలో ఈ వేడుక జరుపుకుంటారు.

వైరల్ భయానీ ఈ కార్డును తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అతిథులందరూ ఇటలీలో ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌కు హాజరు కావాలని అందులో ఉంది.

మే 29న అందరూ కలిసి క్రూయిజ్‌లో చేరతారు. ఈ సమయంలో క్రూయిజ్‌లోని ఫంక్షన్‌లు వెల్‌కమ్ లంచ్ థీమ్‌తో ప్రారంభమవుతాయి.

గతంలో జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ఎంతో వైభవంగా జరిగాయి. ఇప్పుడు మరింత ఘనంగా జరగనుందని తెలుస్తోంది.