గాలి కాలుష్యంపై సంచలన విషయాలు వెల్లడించిన నాసా

09 November 2023

గాలి కాలుష్యంపై సంచలన విషయాలు వెల్లడించింది నాసా. దేశ రాజధాని ఢిల్లీ సహా దేశమంతా విషపూరితమే అని చెప్పడం షాకిస్తోంది.

ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కల్లోలం సృష్టిస్తోంది. చాలా వరకు గాలి విషపూరితంగా తయారైంది.

ఢిల్లీకే పరిమితం కాదు.. దాని పరిసర రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోనూ అలుముకున్న విషపూరిత పొగలు.

విషపూరిత పొగ బంగాళాఖాతం వరకు వ్యాపించిందంటూ ఆసక్తికర చిత్రాలను విడుదల చేసిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఆకాశం నిండా పొగలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించిన చిత్రాలను తాజాగా విడుదల చేసింది నాసా.

నాసా వరల్డ్‌వ్యూ నుంచి వచ్చిన విజువల్స్ భారతదేశంలోని మైదానాలను పొగమంచు దట్టమైన దుప్పటిని కప్పివేసినట్లు చూపించాయి.

గత కొన్ని రోజులుగా భారత దేశ ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాల తీవ్రమైన కేటగిరీలో ఉన్నట్టు చూపుతోంది.

వాయుకాలుష్యం ఢిల్లీలో 421 పాయింట్లు, ఘజియాబాద్‌లో -382, ​​గురుగ్రామ్ - 370, నోయిడా - 348, గ్రేటర్ నోయిడా - 474, ఫరీదాబాద్ -396 గా నమోదు.

వాయు కాలుష్యం కారణంగా గుండె జబ్బులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు.