దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ రెండో ఎడిషన్ ‘సత్తా సమ్మేళనం’లో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారాయన. తాను అధికార పార్టీ నేతల పెదవులపై ఉన్నాను కానీ గుండెల్లో మాత్రం లేనన్నారు.
నేటి కాలంలో రాజకీయ ప్రత్యర్థులను శత్రువుల్లా చూస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేతల పట్ల అధికార పార్టీ సరిగా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్నికైన ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేస్తే, ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం?, ఇంతకుముందు, మధ్యప్రదేశ్, కర్ణాటక, మణిపూర్, గోవాలో ఇలాగే జరిగింది.
వారు గెలవకపోతే ప్రజలు గెలిపించిన పార్టీలను బెదిరింపుల ద్వారా విచ్ఛిన్నం చేస్తారు. ప్రజాస్వామ్య దేశంలో ఇది ఏ మాత్రం సరైనది కాదు.
ప్రజలు కాంగ్రెస్‌ను వీడి ఎన్డీయే కూటమిలో చేరడంపై ఖర్గే మాట్లాడుతూ.. అధికారం కోసం కొంతమంది ఆకలితో ఉన్నారని సైటెర్లు వేశారు.
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు ఇస్తామని ప్రకటించి మోసం చేసిందన్నారు.
ఇండియా కూటమిని ఎవరూ విచ్చిన్నం చేయలేరని ఖర్గే తెలిపారు. ప్రధానమంత్రి అభ్యర్థి ప్రశ్నపై స్పందిస్తూ..ముందు గెలిచి ఆ తర్వాతే ప్రధానమంత్రి ఎవరో నిర్ణయం తీసుకుంటామన్నారు.