06 November 2024
Subhash
చెట్లను నరకడం మరణానికి దారితీసే ఐదు గ్రామాల గురించి మీకు తెలుసా..? ఇక్కడ చెట్లు నరకడం నిషేధం.
చెట్లు మన జీవితానికి చాలా ముఖ్యమైనవి. కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను అందిస్తాయి. ఈ విషయం అందరికి తెలిసిందే.
మనలో చాలా మంది తమ స్వలాభాల కోసం చెట్లను నరుకుతుంటారు. దీని వల్ల వర్షాలు పడకుండా చాలా ఇబ్బందులు వస్తాయి.
దేశంలో చెట్లను నరికితే మరణ శిక్ష పడే గ్రామాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? ఇక్కడ కలప కోసం చిన్న చెట్టు నరకడం కూడా నిషేధమే.
మధ్యప్రదేశ్‌లో సెహూర్ నగరంలోని ఖాకర్‌దేవ్, పక్కనే ఉన్న మన, జార్క్యా, చోరీ, ఛతర్‌పురా గ్రాములలో చెట్లను నరికితే మరణ శిక్ష విధిస్తారు.
2001లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ అటవీ భూమిని లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చుకుంది.
అలాంటి పరిస్థితుల్లో రెండు దశాబ్దాల క్రితం మొదలైన ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది. అడవి తమ దేవుడని, అడవి అనుమతి లేకుండా నరకడం నేమరని భావిస్తున్నారు
ఎవరైనా తమ కులదేవత అనుమతి లేకుండా ఆ ప్రాంతంలో చెట్టును నరికిలీ చనిపోవడం, అనారోగ్యానికి గురికావడం జరుగుతుందని భావిస్తున్నారు.