భారతరత్న వరించడంపై అద్వానీ ఏమన్నారంటే.. 

03 February 2024

TV9 Telugu

భారత మాజీ ఉప ప్రధాని, రాజనీతిజ్ఞుడు, బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న వరించిన విషయం తెలిసిందే. 

 ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రకటించారు.

అయితే భారతరత్న వరించడంపై అద్వానీ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'భారతరత్న'ని తాను గర్వంగా అంగీకరిస్తున్నానని అద్వానీ అన్నారు.

ఇది ఒక వ్యక్తిగా తనకు దక్కిన గౌరవం మాత్రమే కాదని, జీవితాంతం శక్తి మేరకు సేవ చేయడానికి తాను అవలంభించిన ఆదర్శాలకు దక్కిన గౌరవంగా భావిస్తానన్నారు. 

ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిన నాటి నుంచి నుంచి జీవితంలో తనకు అప్పగించిన ప్రతి పనినీ నాకు ఇష్టమైన దేశం కోసం అంకితభావంతో చేశానన్నారు. 

ఈ సందర్భంగా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయి‌లను కృతజ్ఞతతో స్మరించుకుంటానన్నారు.

తనతో లిసి పనిచేసిన లక్షలాది మంది నా పార్టీ కార్యకర్తలు, స్వయంసేవకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఇక భారతరత్న దక్కడంపై అద్వానీ తన భార్య కమలకు కూడా ధన్యవాదాలు తెలిపారు.