01 September 2023

రూ. 436 చెల్లిస్తే.. రూ. 2 లక్షలు మీ సొంతం.!

కుటుంబంలో అన్నీ బావున్నప్పుడు అంతా బావుంటుంది. కానీ, కుటుంబ పెద్ద అనుకోకుండా కాలం చేస్తే.. ఆయన మీద ఆధారపడిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. 

ముఖ్యంగా చిన్న ఆదాయాలు ఉన్న కుటుంబాల్లో కుటుంబ పెద్ద లేకపోతే వచ్చే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. 

ఇటువంటి పరిస్థితిలో ఉన్న వారికి కాస్త ఓదార్పుగా ఉండేందుకు తక్కువ ప్రీమియంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (PMJJBY)ను 2015లోనే ప్రవేశపెట్టింది. 

ఈ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి ఏ కారణంతోనైనా మరణిస్తే రూ.2లక్షల ఇన్సూరెన్స్  డబ్బు మొత్తం కుటుంబానికి అందుతుంది. 

18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులు ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు. బ్యాంకు/ పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఉన్న వారెవరైనా ఈ పథకంలో చేరొచ్చు. 

జాయింట్ ఎకౌంట్ తీసుకున్న వారు కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఇద్దరూ విడివిడిగా ప్రీమియం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పథకం ఒక ఏడాది కాల పరిమితితో వస్తుంది. జూన్‌ 1 నుంచి మే 31 వరకు అమల్లో ఉంటుంది. 

ఈ పథకం ప్రీమియం రూ.436. ఒకసారి ఇందులో చేరిన వారికి మే 25-31 మధ్య ప్రీమియం మొత్తం ఆటో డెబిట్‌ ద్వారా రెన్యువల్‌ అవుతుంది. 

ఈ పథకంలోకి కొత్తగా చేరినా లేదా తిరిగి జాయిన్‌ అయిన వ్యక్తి ఏ కారణం చేతనైనా మరణిస్తే నమోదు చేసుకున్న 30 రోజుల తర్వాత మాత్రమే క్లెయిమ్‌కు అనుమతి ఉంటుంది.