17 August 2023

రూ.25 కోట్ల విలువైన బీరు.. మట్టిలో పోసిన పన్నీరు..

రెండు ప్రముఖ బ్రాండ్లకు చెందిన రూ.25 కోట్ల విలువైన బీర్లను సీజ్ చేసింది కర్ణాటక ఎక్సైజ్ శాఖ. కింగ్‌ఫిషర్ బీర్లలో నిషేధిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించింది. 

కెమికల్ టెస్టుల్లో వచ్చిన రిపోర్ట్ లో మానవ వినియోగానికి పనికిరాదని తేలింది.  కేసు నమోదు చేయడమే కాకుండా స్టాక్‌ను ధ్వంసం చేసేందుకు చర్యలు చేపట్టింది.

మైసూరు జిల్లా నంజన్‌గూడలోని యునైటెడ్ బ్రూవరీస్ అనే కంపెనీ కిగ్‌ఫిషర్ బీర్లను ఉత్పత్తి చేస్తోంది. అయితే వారు ఉత్పత్తి చేస్తున్నటువంటి బీర్లలో నిషేధిత పదార్థాల అవక్షేపం ఉన్నట్లు తేలింది.

కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్, కింగ్‌ ఫిషర్ అల్ట్రా లాగర్ బీర్, శాంపిల్ 7E, 7C బీర్లలో నిషేధిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. రిపోర్టు వచ్చిన వెంటనే ఆ కంపెనీ వద్దకు వచ్చి బీర్లను పరిశీలించారు.

వెంటనే ఆ బీర్ల శాంపిల్స్‌ను పంపించారు. అయితే ఆ బీర్లకు సంబంధించి ఆగస్టు 2 వ తేదిన కెమికల్ రిపోర్టు అందింది. ఆ రిపోర్టులో నిషేధిత పదార్థాల అవక్షేపాలు ఉనట్లు నిర్ధారణ అయింది.

అసలు ఈ బీర్లు మానవులు వినియోగించడానికి వీలు లేదని ఆ నివేదిక పేర్కొంది. వీలనైంత త్వరగా వాటి ఉత్పత్తిని ఆపేయాలని సూచించింది.

ఈ బీర్లలో నిషేధిత పదార్థాల అవక్షేపాలు ఉండటంపై మద్యం ప్రియులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.