ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. 'బిజెపి తన పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తోంది... పాఠశాలలను ఎలా నిర్మించాలో నాకు తెలుసు... మెరుగైన విద్యను ఎలా అందించాలో నాకు తెలుసని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అతిషి మర్లెనా మాట్లాడుతూ.. దేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఈ కూటమి అని చెప్పుకొచ్చారు. ఈరోజు ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వస్తే.. అవి దేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకు వచ్చినవే అన్నారు.
టీవీ9 వాట్ ఇండియా థింక్ టుడే (WITT) కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. గత 75 ఏళ్లలో సాధ్యం కాని దారిద్య్ర రేఖ నుంచి దాదాపు 25 కోట్ల మంది ప్రజలను ప్రధాని మోదీ విముక్తి చేశారని చెప్పుకొచ్చారు.
ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన పసుపు తలపాగా రహస్యాన్ని తెలిపారు. 2014 ఎన్నికల్లో తలపాగా లేకుండా పోటీ చేశానని చెప్పారు. కానీ గెలిచాక సర్టిఫికేట్ తీసుకుని భగత్ సింగ్ గ్రామానికి వెళ్లాడు. దీని తరువాత పసుపు తలపాగా ధరించడం ప్రారంభించానని చెప్పుకొచ్చాడు.
ఇక కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 400 సీట్లు గెలుస్తామన్న విశ్వాసం బీజేపీకి ఉంటే ఎందుకు విధ్వంసం సృష్టిస్తున్నారని అని ప్రశ్నించారు.
బీజేపీకి దక్షిణాదిలో ప్రాభావ్యం లేదన్న వార్తలపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ స్పందిస్తూ.. మొదట్లో ఈశాన్య భారతం గురించి కూడా ఇలాగే మాట్లాడారు కానీ, నేడు, ఈశాన్య రాష్ట్రాల్లోని చాలా రాష్ట్రాలు బీజేపీ లేదా దాని మిత్రపక్షాల ప్రభుత్వం కింద ఉన్నాయనే విషయాన్ని మరవద్దన్నారు.