వితంతువులు మళ్లీ పెళ్లాడితే రూ. 2 లక్షలు.. ప్రకటించిన రాష్ట్ర సర్కార్
TV9 Telugu
08 March 2024
దేశంలోనే తొలిసారి జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ తీసుకోని ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.
‘విధ్వా పునర్వివాహ ప్రోత్సాహన్ యోజన’ పేరుతో వితంత పునర్వివాహ ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించిని జార్ఖండ్ సర్కార్.
భర్త మరణించిన తర్వాత మళ్లీ వివాహం చేసుకున్న మహిళలకు రూ. 2 లక్షల ప్రోత్సాహకం అందిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం.
వితంతు పునర్వివాహం పట్ల ఈ పథకం సామాజిక అభిప్రాయాన్ని మారుస్తుందని భావనలో ఉంది జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం.
ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్, ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఇది వర్తించదు. చనిపోయిన భర్త మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.
ఈ పథకం ప్రయోజనాలు పొందేందుకు లబ్దిదారు పునర్వివాహ తేదీ నుంచి ఏడాది లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది.
జీవిత భాగస్వామి మరణంతో ఒంటరిగా, నిస్సహాయులుగా మిగులుతున్న మహిళలకు కొత్త జీవితాన్ని ప్రారంభించేలా కొత్త పథకం.
ప్రభుత్వ ఆర్థికసాయం వితంతువుల్లో ఈ పథకం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని భావిస్తున్న చంపాయ్ సోరెన్ సర్కార్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి