ఈ కాలేజీ అమ్మాయిని గుర్తుపట్టారా..? ప్రస్తుతం మన దేశ కేంద్ర మంత్రి..

February  1, 2024

TV9 Telugu

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (ఫిబ్రవరి 1) ఉదయం 11 గంటలకు తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె బాల్యం, విద్య, వృత్తి, రాజకీయ జీవితం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి

తమిళనాడులోని మధురై నుంచి భారత ఆర్ధిక మంత్రి వరకు ఎదిగిన మంత్రి నిర్మల లైఫ్‌ జర్నీ చాలా స్ఫూర్తి దాయకంగా సాగింది. తమిళనాడులోని మధురైలో 1959, ఆగస్టు 18న జన్మించారు. మద్రాస్‌, తిరుచిరాపల్లిలో ఆమె విద్యాభ్యాసం పూర్తి చేశారు

1980లో తిరుచిరా పల్లిలోరి సీతాలక్ష్మీ రామస్వామి కాలేజీ నుంచి ఆర్ధికశాస్త్రంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పూర్తి చేశారు. కాలేజీ రోజుల్లో డిబేట్‌, విద్యార్ధి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనేవారు

ఢిల్లీ జేఎన్‌టీయూలో ఎకనామిక్స్‌లో పీజీ, ఎంఫిల్‌ పూర్తి చేసిన నిర్మల అక్కడే పరిచయమైన పరకాల ప్రభాకర్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు

లండన్‌లోని ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌ (PWC)లో సీనియర్‌ మేనేజర్‌గా విశేష అనుభవాన్ని పొందారు. BBC వరల్డ్‌ సర్వీస్‌లో పనిచేస్తున్నప్పుడు కమ్యునికేషన్‌ స్కిల్స్‌ మరింత పెంచుకున్నారు

అలాగే హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్‌ పబ్లిక్‌ పాలసీ స్టడీస్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. చదువుపై తనకున్న ఆసక్తికిగానూ హైదరాబాద్‌లో ప్రణవ అనే స్కూల్‌ను స్థాపించారు

2006లో బీజేపీలో చేరిన నిర్మల మోదీ హయంలో వివిధ పదవుల్లో పనిచేసిన ఆమె విభిన్న రంగాల్లో అనుభవం గడించారు. సంక్లిష్టమైన ఆర్ధిక, విధనపర సమస్యలను సమర్ధవంతంగా చక్కబెట్టడంలో నిర్మల దిట్ట

ఆమె పదునైన మేధస్సు, క్లియర్‌ కమ్యునికేషన్‌, వ్యూహాత్మక ఆలోచనలు తిరుగులేని గుర్తింపు దక్కేలా చేశాయి. రాజకీయాల్లోకి రాకముందు సేల్స్‌ పర్సన్‌గా, అగ్రికల్చరల్ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌లో అసిస్టెంట్‌ ఎకనామిస్ట్‌గా కూడా పనిచేశారు