TV9 Telugu
దేశంలో తొలి అండర్‌వాటర్ మెట్రో
06 March 2024
దేశంలో మొట్టమొదటి అండర్‌వాటర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. విద్యార్థులతో కలిసి నదీ గర్భంలో మోదీ ప్రయాణం
కోల్‌కతా మెట్రో రైలు విస్తరణలో భాగంగా నిర్మించిన ఈ అండర్ వాటర్ మెట్రో రైలు కారిడార్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం
దేశంలో తొలి మెట్రో రైలు 1984 లోనే కోల్‌కతాలో పరుగులు తీయగా.. తాజాగా అండర్ వాటర్ టన్నెల్ మెట్రో కూడా కోల్‌కతాలోనే ప్రారంభం
రూ.120 కోట్ల వ్యయంతో హుగ్లీ నది కింద టన్నెల్ నిర్మాణం. 520 మీటర్ల పొడవైన టన్నెల్‌లో హుగ్లీ నదిని 45 సెకన్లలో దాటేస్తుంది.
కోల్‌కతా ఈస్ట్-వెస్ట్ మెట్రో పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా, 10.8 కిలోమీటర్ల పొడవున మెట్రో భూమి కింద ఉంటుంది.
ఈ మార్గంలో హావ్‌డా మైదాన్ నుంచి ఎస్‌ప్లనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైనులో 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్ మెట్రో టన్నెల్.
అండర్ వాటర్ టన్నెల్‌ను అత్యాధునిక టెక్నాలజీతో ప్రకృతి విపత్తులను కూడా తట్టుకునేలా బ్రిటన్‌కు చెందిన పలు ప్రఖ్యాత సంస్థల సహకారంతో నిర్మాణం.
హౌరా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గంటన్నర సమయం పడుతుండగా.. ఈ అండర్‌వాటర్ మెట్రో మార్గం అందుబాటులోకి రావడంతో కేవలం 40 నిమిషాల ప్రయాణం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి