TV9 Telugu
ఆ గ్రామంలో టచ్ చేస్తే జరిమానా కట్టాల్సిందే..!
04 March 2024
మలానా గ్రామంలో ప్రతి నిర్ణయాన్ని గ్రామస్తులందరు కలిసి సమిష్టిగా చర్చించి తీసుకుంటారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు ఉంటాయి.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం గ్రామంలోని అన్ని నియమాలు ఏమిటో స్పష్టంగా తెలియజేస్తూ గ్రామం వెలుపల ఒక బోర్డు ఏర్పాటు చేశారు.
గ్రామంలోని ఉన్న వస్తువులను ఎవరైనా ముట్టుకుంటే ఎంత జరిమానా విధిస్తామని కూడా నియమాల జాబితాలో రాసి ఉంది.
ప్రమాదవశాత్తు ఏదైనా వస్తువును తాకితే నియమం ప్రకారం పర్యాటకుడికి రూ.1,000 నుంచి రూ.2,500 జరిమానా విధించవచ్చు.
మలానా గ్రామంలోని షాప్‌లోని ఏ వస్తువులనూ తాకలేరు. అవసరమైన అన్ని వస్తువులను చూసి, కావల్సిన వాటిక డబ్బు ముందుగానే చెల్లించాలి.
మలానా గ్రామంలో ఏ ఒక్క పర్యాటకుడు సైతం గ్రామంలోని పరిసరాలను వీడియో తీయడానికి లేదు. కేవలం ఫోటోగ్రాఫ్‌లను మాత్రమే తీసకోవల్సి ఉంటుంది.
మలానాలో చెట్లు, పొదలను కాల్చడంపై నిషేధం విధించారు. మొక్కలను సంరక్షించేందుకు ఈ నిబంధన పెట్టారు గ్రామస్తులు.
మలానా గ్రామ నియమాల ప్రకారం బయటి వ్యక్తులు స్థానిక భాష మాట్లాడకూడదు. ఇక్కడ కన్నాషి భాష మాత్రమే మాట్లాడతారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి