భారత దేశంలో ఆయుధాల చట్టం, 1959 ప్రకారం దేశవ్యాప్తంగా అవసరమున్న ప్రజలకు గన్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
భారతదేశంలో ఆయుధం కోసం లైసెన్స్ పొందాలనుకునే ప్రతి వ్యక్తికి కచ్చితంగా 21 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
ఆయుధ లైసెన్స్ కోసం మీ దగ్గర ఉన్న జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
తుపాకీ లైసెన్స్ పొందాలనుకునే వారు దరఖాస్తు సమయంలో కొన్ని ముఖ్యమైన పత్రాలు తప్పనిసరిగా అధికారులకు సమర్పించాలి.
ఆయుధ లైసెన్స్ పొందాలనుకునేవారు గుర్తింపు ధృవీకరణ పత్రంతో పాటు చిరునామా రుజువు తప్పనిసరిగ సమర్పించాలి.
మానసిక స్థితితో పాటు శారీరకంగా ధృడంగా ఉన్నట్లు మెడికల్ సర్టిఫికేట్, వయస్సు సర్టిఫికేట్, క్యారెక్టర్ సర్టిఫికేట్, ITR దరఖాస్తుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసిన తర్వాత, జిల్లా మేజిస్ట్రేట్ సిఫార్సుపై లైసెన్స్ పొందుతారు. ఎలాంటి చిన్న అభ్యంతరం ఉన్నా తిరస్కరించే అవకాశముంది.
జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ఆయుధ లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే మీరు ఆయుధాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.