మొట్ట మొదటి అవిశ్వాస తీర్మానం 1963లో జవహర్‌లాల్ నెహ్రూ ఎదుర్కొన్నారు
ఇందిరా గాంధీ 16 ఏళ్ల పాలనలో15 అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్నారు
స్వాతంత్య్రానంతర భారతంలో అత్యధిక అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్న ప్రధాని ఇందిరా గాంధీనే
మొదటి విడతలో 12, రెండో విడతలో మూడు అవిశ్వాస తీర్మానాలను ఆమె ఎదుర్కొన్నారు
ఆరవ లోక్‌సభలో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం 2 అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొంది
మొదటి సారి నెగ్గినా రెండో అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగియకముందే 1979 జులై 15న ఆయన రాజీనామా చేశారు. దీంతో అవిశ్వాస తీర్మానంతో పతనమైన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఇదే
లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహా రావు మూడేసి సార్లు, మొరార్జీ దేశాయ్, వాజ్‌పేయి రెండేసి సార్లు, జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ ఒక్కొక్కసారి ఎదుర్కొన్నారు
పివి నరసింహారావు మూడు అవిశ్వాస పరీక్షలూ గట్టెక్కినా 3వ అవిశ్వాస తీర్మానంపై ఆయన నెగ్గిన తీరు వివాదాస్పదమైంది