అయోధ్య రామమందిరానికి ధన్నీపూర్ మసీదు ఎంత దూరం..?

28 December 2023

TV9 Telugu

2019 నవంబర్ 9 నాటి సుప్రీం కోర్టు తీర్పుతో ఉత్తరప్రదేశ్ లో అయోధ్య రామమందిరం నిర్మాణానికి మార్గం సుగమం చేసింది.

రామ జన్మభూమి - బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ మసీదు నిర్మాణానికి ఐదెకరాలను అప్పగించింది.

ధన్నీపూర్ మసీదు ఇస్లామిక్ కల్చరల్ రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి ముస్లింలకు 5 ఎకరాల భూమిని ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.

అయోధ్య నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నీపూర్ అనే గ్రామంలో మసీదు నిర్మాణం కోసం భూమిని కేటాయించారు.

23,507 చదరపు మీటర్ల భూమిలో ఒక మసీదు, ఆసుపత్రి, ఒక మ్యూజియం, ఒక సర్వీస్ బ్లాక్‌ను నిర్మించాలని నిర్ణయించారు.

వచ్చే ఏడాది 2024 నాటికి మసీదు పునాది వేయాలని భావిస్తున్నారు. మసీదులో ఏకకాలంలో 9 వేల మంది నమాజ్ చేయవచ్చు.

నిరుపేదల కోసం 200 పడకలతో ఆసుపత్రి నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ మసీదు ఆకారం భూమిలా గుండ్రంగా ఉంటుంది.

1857 స్వాతంత్ర్య పోరాటం థీమ్‌తో మ్యూజియంను నిర్మించాలని నిర్ణయించారు. మౌల్వీ అహ్మదుల్లా షాకు అంకితం చేయాలని భావిస్తున్నారు.