వాహనదారులకు గుడ్ న్యూస్..

03 January 2024

TV9 Telugu

హమ్మయ్యా.. ఎట్టకేలకు దేశ వ్యాప్త సమ్మెను విరమించుకున్నారు ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్లు. కేంద్రంతో చర్చలు సఫలమయ్యాయి.

కేంద్రం ప్రవేశపెట్టిన హిట్‌ అండ్‌ రన్‌ చట్టాన్ని తక్షణమే అమలు చేయడం లేదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా కీలక ప్రకటన చేశారు.

నిబంధన ఇంకా అమల్లోకి రాలేదని ట్రాన్స్‌ పోర్టు సంఘాలతో విస్త్రృత చర్చలు జరిపిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

దీంతో సంతృప్తి వ్యక్తం చేశారు ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్లు. డ్రైవర్లు వెంటనే విధుల్లో చేరాలని పిలుపునిచ్చారు. దీంతో దేశ ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నారు.

డ్రైవర్ల ఆందోళనతో ట్యాంకర్లు, ట్రక్కులు నిలిచిపోవడంతో పెట్రోల్‌ కొరత ఏర్పడుతుందనే భయంతో వాహనదారులు పెట్రోల్‌ బంక్‌ల వద్దకు భారీ ఎత్తున చేరుకున్నారు.

దీంతో హైదరాబాద్‌లో ఐకియా జంక్షన్‌, పంజాగుట్ట, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్‌, నాంపల్లి, మియాపూర్‌ సహా అనేక చోట్ల కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ స్థంభించింది.

చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు ట్రాఫిక్, మరోవైపు పెట్రోల్ బంక్‌ లవద్ద ఉద్రిక్త పరిస్థితి కంట్రోల్ చేయలేక పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు.

నిన్న రాత్రి అన్ని బ్యాంకులకు పెట్రోల్ ట్యాంకర్లు చేరుకోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఇంకా కొంతమంది బ్యాంకులకు క్యూ కడుతున్నారు.