వచ్చే వారం నుంచి ‘భారత్ రైస్’ విక్రయాలు
TV9 Telugu
03 February 2024
వచ్చే వారం నుంచి ‘భారత్ రైస్’ విక్రయాలు మొదలుకానున్నాయి. దీని ద్వారా రూ.29కే కిలో బియ్యం ఇవ్వనున్నారు.
ఇటీవల బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దినికి సిద్ధమైంది.
భారత్ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయించనుంది ఇండియా ప్రభుత్వం. కిలో రూ.29 చొప్పున అమ్మకాలు చేపట్టనుంది.
వచ్చే వారం నుంచి విక్రయాలు ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు.
దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగిన వేళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మధ్య తరగతికి ఊరటనివ్వనుంది.
నేషనల్ అగ్రికల్చర్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED) ద్వారా ఈ బియ్యాన్ని విక్రయించనుంది ప్రభుత్వం.
దీనితో పాటు నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF), కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాల్లో బియ్యాన్ని అమ్మనున్నారు.
ఇ-కామర్స్ వేదికగానూ భారత్ రైస్ లభించనుంది. ఇప్పటికే భారత్ గోధుమపిండి కిలో రూ.27.50, భారత్ దాల్ (శనగ పప్పు)ను రూ.60 చొప్పున కేంద్రం విక్రయిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి